న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో ఉన్న స్టేటన్ ఐలాండ్లో జరిగిన మిస్ శ్రీలంక పోటీలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం పోటీలు ముగిసిన తర్వాత రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. సుమారు 300 మంది ఆ ఈవెంట్కు హాజరయ్యారు. అయితే ఏ కారణం చేత గొడవ అయ్యిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ఘటనలో కొంత ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది. రెండు గ్రూపులు తన్నుకున్న కేసులో కొందర్ని అరెస్టు చేశారు.
స్టేట్ ఐలాండ్లో ఎక్కువ సంఖ్యలో లంకేయులు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ దీవిలోనే మిస్ శ్రీలంక పోటీలు నిర్వహించాలని ఆర్గనైజర్లు భావించారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో స్టేట్ ఐలాండ్లో మిస్ శ్రీలంక పోటీలను నిర్వహించారు.
అయితే పోటీలో పాల్గొన్న 14 మంది కాంటెస్టెంట్లలో ఎవరు కూడా గొడవకు దిగలేదని మిస్ శ్రీలంక పోటీ నిర్వాహకులు తెలిపారు. అందాల పోటీల వేళ జరిగిన ఘర్షణతో శ్రీలంక ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు ఆరోపించారు.
Miss Sri Lanka New York after party – video 2 pic.twitter.com/sp94xPe4lK
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022