SL vs IRE | చెలరేగిన పెరీరా, థీక్షణ.. తొలి పోరులో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..!
SL vs IRE : పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక అదిరే బోణీ కొట్టింది. స్వదేశంలో తొలి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. థీక్షణ(3-23), పతిరణ(3-25)లు మూడేసి వికెట్లతో చెలరేగగా లంక 20 పరగుల తేడాతో గెలిచి రెండు పాయింట్లు సొంతం చేసుకుంది.
SL vs IRE : పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక అదిరే బోణీ కొట్టింది. స్వదేశంలో తొలి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. కుశాల్ పెరీరా(56 నాటౌట్ ), కమిందు మెండిస్(44) మెరుపులతో భారీ స్కోర్ చేసిన లంక.. ప్రత్యర్థిని 143కే ఆలౌట్ చేసింది. హ్యారీ టెక్టర్(40) పోరాడినా.. సమచరుల నుంచి మద్దతు కరువైంది. లంక బౌలర్లలో థీక్షణ(3-23), పతిరణ(3-25)లు మూడేసి వికెట్లతో చెలరేగగా లంక 20 పరగుల తేడాతో గెలిచి రెండు పాయింట్లు సొంతం చేసుకుంది.
లీగ్ దశల తొలి మ్యాచ్‌లో శ్రీలంక అలవకోగా గెలుపొందింది. ప్రేమదాస స్టేడియంలో కుశాల్ పెరీరా(56 నాటౌట్), కమిందు మెండిస్(44)ల పోరాటంతో భారీ స్కోర్ చేసిన లంక.. అనంతరం ప్రత్యర్థిని పడగొట్టింది. 163 పరగుల ఛేదనలో ఐర్లాండ్‌కు షాకిస్తూ.. పవర్ ప్లే లోనే ఓపెనర్ పాల్ స్టెర్లింగ్(6)ను థీక్షణ(3-23)బౌల్డ్ చేసి ఒత్తిడిలో పడేశాడు.
They were in it for a bit, but Sri Lanka’s spinners proved to be too much for Ireland with Hasaranga & Theekshana picking 3-fors 🌀
A good start for the co-hosts as they complete a hard-fought win: https://t.co/c2ygWIdVRk pic.twitter.com/5YRag9lHUH
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2026
అనంతరం హ్యారీ టెక్టర్(40), లొర్కాన్ టక్నర్(21)లు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. గాయంతో ఇబ్బంది పడుతూనే బౌలింద్ చేసిన హసరంగ క్రీజులో కుదురుకున్న టెక్టర్‌ను బౌల్డ్ చేసి కీలక బ్రేకిచ్చాడు. అనంతరం థీక్షణ విజృంభణతో వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. చివరి ఆరు బంతుల్లో 27 రన్స్ అవసరమవ్వగా.. పథిరన(3-25) రెండు వికెట్లు తీయడంతో 143కే ఐర్లాండ్ ఆలౌటయ్యింది.
మెరిసిన పెరీరా, మెండిస్
టాపార్డర్ విఫలమైనా శ్రీలంకను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. కుశాల్ పెరీరా(56 నాటౌట్), కమిందు మెండిస్(44) రాణించారు. ఐర్లాండ్ ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా లంక ద్వయానికి కలిసొచ్చింది. డెత్ ఓవర్లలో మరింత చెలరేగాలనుకున్న మెండిస్, దసున్ శనక(0) గోల్డెన్ డక్‌గా వెంట వెంటనే ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో బౌండరీతో పెరీరా హాఫ్ సెంచరీ సాధించగా ప్రత్యర్ధికి 164 పరగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆతిథ్య జట్టు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


