ఇస్లామాబాద్ : గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ స్పందిస్తూ, మైక్రోసాఫ్ట్ సేవల ముగింపును బట్టి దేశం ఇప్పుడు అనిశ్చితి సుడిగుండంలోకి జారుకుంటున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగిత పెరుగుతున్నదని, ప్రతిభావంతులు విదేశాలకు వలసపోతున్నారని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.