లండన్: బ్రిటీష్ మిలిటరీ ఏజెన్సీ ఎంఐ6 ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఆ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇప్పుడు కొత్త బాస్‌ను నియమిస్తున్నది. ఐంఎ6కు తొలిసారి మహిళా చీఫ్‌ను నియమించారు. బ్లెయిసీ మెట్రివేలీ(Blaise Metreweli) అనే 47 ఏళ్ల మహిళా ఆఫీసర్‌ను ఎంఐ6 చీఫ్‌గా ప్రకటించారు. 115 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తొలిసారి మహిళను చీఫ్‌గా రిక్రూట్ చేశారు. సర్ రిచర్డ్ మూర్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంఐ6 చీఫ్‌ను సీ కోడ్‌నేమ్‌తో పిలుస్తారు. అయితే ఆ ఆఫీసర్ నేరుగా తమ ఏజెంట్ల వివరాలను విదేశాంగ కార్యదర్శికి రిపోర్టు చేస్తారు.
ఎంఐ6లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖలను చూసే ‘Q’కు డైరెక్టర్ జనరల్‌గా ఆమె ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఐ5కి గతంలో ఆమె సీనియర్ పొజిషన్లో సేవలు అందించారు. స్వదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ5కి గతంలో ఇద్దరు మహిళలు చీఫ్లుగా చేశారు. దాంట్లో స్టెల్లా రిమింగ్టన్, ఎలిజా మనిన్గం బుల్లర్ ఉన్నారు.
బ్లెయిసీ మెట్రివేలీ .. క్యాంబ్రిడ్జ్లోని పెంబ్రోక్ కాలేజీలో ఆంత్రపాలజీ చదువుకున్నారు. సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎంఐ6)లో 1999లో ఆమె చేరారు. మిడల్ ఈస్ట్‌తో పాటు యూరోప్‌లో ఆమె అనేక ఆపరేషనల్ రోల్స్‌లో పాల్గొన్నారు. ఎంఐ6లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఐ5లో డైరెక్టర్ లెవల్ పొజిషన్లో చేశారు. ఎంఐ6 చీఫ్‌గా నియమించడం పట్ల గర్వంగా ఉందని బ్లెయిసీ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ఎంఐ6తోపాటు ఎంఐ5, జీసీహెచ్కూ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ధైర్యవంతులైన ఆఫీసర్లు, ఏజెంట్ల తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆమె చెప్పారు.
పాపులర్ ఫిల్మ్ ఫిక్షనల్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్.. ఎంఐ6 ఏజెంట్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 1909లో ఎంఐ6 స్టార్ట్ అయ్యింది. దాని ఏజెంట్లు నేరుగా విదేశాంగ మంత్రికి రిపోర్టు చేస్తారు. ఉగ్రవాదం, సైబర్‌దాడుల లాంటి అంశాలపై ఆ ఏజెన్సీ ఫోకస్ చేస్తుంది.