టోక్యో: ఉత్తర జపాన్‌లో 80 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి మోసం చేసి రూ.6 లక్షలు కొట్టేశాడు. హొక్కాయిడోలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు జూలైలో ఓ వ్యక్తిని సామాజిక మాధ్యమాల్లో కలిశారు. తాను వ్యోమగామిగా పని చేస్తున్నానని ఆ వ్యక్తి ఆమెకు చెప్పాడు. క్రమంగా తనపై ఆమెకు నమ్మకం పెరిగేలా చేశాడు. రొమాన్స్ స్కామ్‌లోకి దించాడు.
ఓ రోజు ఆమెతో మాట్లాడుతూ, “నేను ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నాను” అని చెప్పాడు. తనకు ఆక్సిజన్ అత్యవసరమని తెలిపాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆన్లైన్లో తనకు డబ్బులు పంపించాలని చెప్పాడు. తమ మధ్య నిజాయితీతో కూడిన మానసిక అనుబంధం ఉందని నమ్మిన ఆమె అతనికి రూ.6 లక్షలు పంపించారు.