డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్, ఆయన భార్య నిషా బ్యాంకు ఖాతాల్లోకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు జమయ్యాయి. ఈ విషయం రాజకీయ దుమారానికి దారి తీసింది. అయితే గతంలో ఎమ్మెల్యే దంపతులకు జాబ్ కార్డులు ఉండటం వల్లే ఆ నిధులు జమ అయ్యాయని బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు.
తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఈ కుట్ర జరిగిందని దుర్వేశ్వర్లాల్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బ్లాక్ డెవలప్మెంట్ అధికారి శశి భూషణ్ ఎమ్మెల్యే దంపతుల ఖాతాల్లో జమ అయిన ఉపాధి హామీ నిధులను రికవరీ చేస్తామని తెలిపారు. దుర్గేశ్లాల్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఉపాధి హామీ పనుల ద్వారా రూ.5,214 పొందారు.
2021-25 మధ్య కాలంలో ఎమ్మెల్యే దంపతులిద్దరూ కలిసి ఈ పథకం ద్వారా రూ.22,962 వేతనంగా పొందినట్లు తేలింది. అయితే ఇందుకు సంబంధించిన మస్టర్ రోల్స్‌పై తాను సంతకాలు చేయలేదని సంబంధిత అసిస్టెంట్ ఉద్యోగి యశ్వంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లు అందుబాటులో లేవన్నారు.