న్యూఢిల్లీ: ఇతరులు మాట్లాడేటపుడు వినేవారి కనురెప్పలు కొట్టుకోవడం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇతర శబ్దాలు వినిపిస్తున్నపుడు కనురెప్పల కదలికలు తగ్గుతాయి. కెనడాలోని మాంట్రియేల్లో ఉన్న కొంకార్డియా విశ్వవిద్యాలయం సైకాలజీ రీసెర్చర్ పెనెలోప్ కౌపాల్ మాట్లాడుతూ, ఈ అధ్యయనంలో 49 మంది పాల్గొన్నారు.
వీరు కొన్ని వాక్యాలను వింటూ ఉండగా, వీరి కనురెప్పలు కొట్టుకునే సంఖ్యను నమోదు చేశారు. ఈ ప్రయోగాల్లో వెలుగు పరిస్థితిని, నేపథ్యం నుంచి వినపడే శబ్దాలను మార్చుతూ, అధ్యయనం చేశారు.