లూసియానా, డిసెంబర్ 26: లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తన కుటుంబ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సంపదను తన ఉద్యోగులకు పంచి నిజ జీవిత శాంటా క్లాజ్‌గా నిలిచాడు. గ్రాహం వాకర్ అనే ఈ వ్యాపారి 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,155.7 కోట్లు)ను తన 540 మంది సిబ్బందికి పంచిపెట్టి దాతృత్వానికి నిదర్శనంగా నిలిచాడు.
లూసియానాకు చెందిన గ్రాహం వాకర్ ఇటీవల తన కుటుంబ కంపెనీ అయిన ఫైర్‌బ్రాండ్‌ను అమ్మాడు. అది అమ్మగా వచ్చిన మొత్తంలో 15 శాతం తన ఉద్యోగులు పొందుతారని కొనుగోలుదారునికి షరతు విధించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.