Triphallia | లండన్, అక్టోబర్ 16: మూడు పురుషాంగాలతో ఓ వ్యక్తి జీవించినట్టు యూకేలోని బర్మింగ్‌హామ్ మెడికల్ స్కూల్‌కు చెందిన వైద్య విద్యార్థులు గుర్తించారు. 78 ఏండ్ల సదరు వ్యక్తి మరణించిన తర్వాత తన మృతదేహాన్ని పరిశోధనలకు దానంగా ఇచ్చారు.
ఆయన మృతదేహంపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు అతడికి మూడు పరుషాంగాలు ఉన్నట్టు గుర్తించారు. అత్యంత అరుదైన ఈ సమస్యను త్రిఫాల్లియా అంటారు. ఈ వ్యక్తికి ఒక పురుషాంగం బయటకు ఉండగా, అదనంగా ఉన్న రెండు పురుషాంగాలు బీజకోశంలో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. అదనపు పురుషాంగాల గురించి అతడికి తెలిసి ఉండదని వీరు భావిస్తున్నారు.
ఈ సమస్య ఉన్న వారిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, అంగస్తంభన లోపం, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పారు. ఇంతకుముందు 2020లో ఇరాక్‌లోని దుహోక్లో ఓ మూడు నెలల బాలుడిలో ఈ సమస్యను గుర్తించారు. పెద్దవారిలో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి.