‘మే డే’. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే. ఆ శ్రమే వెట్టిచాకిరికి గురైనప్పుడు ఏమవుతుంది..? శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది..? కష్టించి పని చేసే చేతులు పిడికిళ్లు బిగిస్తాయి.. భూకంపాలను తీసుకొస్తాయి.. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మే డే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.
భారతదేశంలో చాలా ఆలస్యంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నాము. 1923 మే 1వ తేదీన మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలను జరుపుకున్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు, నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది.
2011: సెప్టెంబర్ 11 పేలుళ్ల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ హత్యకు గురైనట్లు ప్రకటించిన బరాక్ ఒబామా
1993: బాంబు పేలుడులో శ్రీలంక అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస్ మరణం
1972: దేశంలోని బొగ్గు గనులను జాతీయం చేసిన ప్రభుత్వం
1961: క్యూబాను సోషలిస్టు దేశంగా ప్రకటించి ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలికిన క్యూబా ప్రధాన మంత్రి డాక్టర్ ఫిడేల్ కాస్ట్రో
1960: బొంబాయి రాజ్యం నుంచి విడివడి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పాటు
1913 : నటుడు బాలరాజు సాహ్ని జననం
1897: రామకృష్ణ మిషన్ను స్థాపించిన స్వామి వివేకానందుడు
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..