శక్తిమంతమైన మంచు తుఫాన్ డెవిన్ అమెరికాలో బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం శనివారం దాదాపు 9,000 విమానాలపై పడింది. వీటిలో కొన్ని సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. శుక్ర-శనివారాల మధ్య దాదాపు 2,700 విమానాలు రద్దయ్యాయి.
వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 1,802 విమానాలు రద్దు కాగా, 22,349 విమానాలు ఆలస్యమయ్యాయి. గత మూడేండ్లలో ఈ స్థాయిలో మంచుకురవడం ఇదే తొలిసారి.