టెహ్రాన్: ఇరాన్‌లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించగా, సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటన జరిగిన పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.
సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను పంపించినట్లు హెర్మోజ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చీఫ్ మొక్తార్ సలాహ్షౌర్ చెప్పారు. చాలా కంటెయినర్లు పేలడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని హార్మొజ్గాన్ ప్రావిన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ మెహ్ద్రద్ హస్సన్ జడేహ్ చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానలకు తరలించినట్లు తెలిపారు.