బీరూట్ : హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. వేలాది మంది ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బీరూట్‌లోని ఓ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ కలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరంగ్చి, లెబనాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశాధ్యక్షుడి ప్రతినిధులు, ప్రధాన మంత్రి పాల్గొన్నారు. లెబనాన్‌లో ఇంత పెద్ద ఎత్తున అంత్యక్రియలు జరగడం 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. హెజ్బొల్లా మాజీ చీఫ్ నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో ఐదు నెలల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఉగ్రవాద సంస్థకు 30 ఏళ్లకుపైగా నాయకత్వం వహించారు. ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. నస్రల్లా అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బీరూట్ గగనతలంలో చక్కర్లు కొట్టాయి.