శాంటియాగో(చిలీ), మే 2 : చిలీ, అర్జెంటీనాలోని దక్షిణ కోస్తా ప్రాంతాలలో శుక్రవారం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. చిలీకి దక్షిణాన మెగేలియన్ జలసంధికి చెందిన కోస్తా ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. సునామీ హెచ్చరికలు రావడంతో కోస్తా ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. చిలీకి చెందిన అంటార్కిటిక్ భూభాగంలోని బీచ్ ప్రదేశాలను వదిలిపెట్టి వెళ్లిపోవాలని కూడా పర్యాటకులు, స్థానిక ప్రజలను చిలీ ప్రభుత్వం ఆదేశించింది.