Masoud Pezeshkian | ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు.. సంస్కరణవాది పెజెష్కియాన్ విజయం
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందినట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం వెల్లడించింది.
Masoud Pezeshkian | టెహ్రాన్, జూలై 6: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందినట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం వెల్లడించింది. పెజెష్కియాన్ 1.7 కోట్లకు పైగా ఓట్లు సాధించగా, ప్రత్యర్థి అభ్యర్థి అతి సంప్రదాయవాద నేత సయీద్ జలిలికి 1.3 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి.
అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ ఏడాది మేలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. శుక్రవారం రన్ ఆఫ్ పోలింగ్(రెండో బ్యాలెట్) నిర్వహించారు. మొత్తం 49.8% ఓటింగ్ నమోదైందని అంతర్గత శాఖ తెలిపింది. పెజెష్కియాన్‌కు మాజీ అధ్యక్షులు హసన్ రౌహానీ, ఖటామీ మద్దతిచ్చారు.