పార్లమెంటును రద్దుచేసిన ప్రధాని
రోమ్, జూలై 22: ఇటలీలో ప్రధాని మారియో డ్రాగి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. గురువారం విశ్వాస తీర్మానానికి ఓటింగ్ జరుగగా సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్ర పక్షాలు బహిష్కరిం చాయి.
దీంతో ప్రధాని పదవికి మారియో డ్రాగి రాజీనామా చేయగా దేశ అధ్యక్షుడు ఆమోదించారు. ప్రస్తుతం వేరే పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ముందస్తు ఎన్నికలు జరుగనున్నాయి.