ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా కంపెనీ సరిగ్గా స్పందించలేదని మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్‌ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించాడు. కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.