పఫర్ ఫిష్ లేదా బ్లో ఫిష్ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన చేపల్లో ఒకటి. ఈ చేపల్లో టెట్రోడ్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది ప్రాణాంతకం. సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది. దీనిపై ఏదైనా జంతువులు దాడిచేసేందుకు వస్తే తన రక్షణ యంత్రాంగాలను తెరుచుకుంటుంది. ఈ విషయం తెలిసినా ఓ వ్యక్తి పఫర్ ఫిష్‌తో ఆడుకున్నాడు. తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘వైల్డ్ లైఫ్ యానిమాల్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి పఫర్ షిష్‌ను చేతితో తాకాడు. దాని స్పైక్స్ వేళ్లకు గుచ్చుకొని, రక్తం కారింది. బలవంతంగా దానినుంచి చేతిని విడిపించుకున్న వ్యక్తి బాధతో గట్టిగా అరిచాడు. ఈ వీడియో ఇప్పటివరకూ 1.57లక్షలకుపైగా వీక్షణలను సొంతం చేసుకుంది. 1,400లైక్స్‌తో దూసుకుపోతున్నది. ‘అలాంటి విషపూరిత జంతువులతో ఆటలొద్దు’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.