సడెన్గా ఇంటి వెనుక ఒక మొసలి కనిపించిందనుకోండి ఏం చేస్తాం? భయంతో బయటకు రాకుండా తలుపులన్నీ వేసేసుకొని కూర్చుంటాం. కానీ ఈ తాత మాత్రం వంట గదిలో కనిపించిన ఫ్రైయింగ్ పాన్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. తన మీదకు దూసుకొచ్చిన మొసలి నెత్తిన టపటపా రెండు బాదాడు.
ఆ దెబ్బకు దిమ్మతిరిగిందేమో.. ఆ మొసలు వెనక్కు తిరిగి పొదల్లోకి పారిపోయింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నది సమీపంలోని గోట్ ఐలాండ్ లాడ్జ్ వద్ద జరిగింది. ఇక్కడ ఒక పబ్ నడిపే కామ్ హాన్సెన్ చాలా కాలం క్రితం ఇక్కడకు వచ్చేశారు. ఈ ప్రాంతంలో మొసళ్లు చాలా ఉంటాయని తెలిసినా కూడా పబ్ ఓపెన్ చేసి, వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఆయన పిప్పా అనే చిన్న కుక్కపిల్లను పెంచుకునేవాడు.
ఆ కుక్కపిల్ల కూడా గట్టిగా అరుస్తూ మొసళ్లను తరిమేసేది. అయితే ఒకసారి ఒక పెద్ద మొసలి ఆ కుక్కపిల్లను చంపేసిందని హాన్సెన్ తెలిపారు. అప్పటి నుంచి తానే ఇలా మొసళ్లను తరుముతున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 20 లక్షలపైగా వ్యూస్ వచ్చాయి.