Annapurna Studios | అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ఓకే చేయాలంటే ఇంత మందిని ఒప్పించాలా?
Annapurna Studios | కొత్త దర్శకులు ఒక కథతో సినిమా చేయాలంటే ముందుగా నిర్మాతలను మెప్పించాలి. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థల్లో కథను ఒక్క నిర్మాత మాత్రమే వినడం ఉండదు. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, క్రియేటివ్ టీమ్, సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తులు.. ఇలా చాలామంది కథ విని, దానిపై చర్చించిన తర్వాతే సినిమా పట్టాలెక్కుతుంది.
Annapurna Studios | కొత్త దర్శకులు ఒక కథతో సినిమా చేయాలంటే ముందుగా నిర్మాతలను మెప్పించాలి. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థల్లో కథను ఒక్క నిర్మాత మాత్రమే వినడం ఉండదు. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, క్రియేటివ్ టీమ్, సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తులు.. ఇలా చాలామంది కథ విని, దానిపై చర్చించిన తర్వాతే సినిమా పట్టాలెక్కుతుంది. తాజాగా హీరో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నరేష్.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన సినిమా కథ ఓకే కావడానికి జరిగిన ప్రక్రియ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం సాధారణ విషయం కాదని అన్నారు. దర్శకుడు చంద్రమోహన్ రాసుకున్న కథను అన్నపూర్ణ స్టూడియోస్‌లోని పలువురు కీలక వ్యక్తులకు వివరించి, వారి అంగీకారం తీసుకున్న తర్వాతే సినిమా ఓకే అయిందని తెలిపారు.చంద్రమోహన్ రాసిన కథను అన్నపూర్ణ స్టూడియోలో నిమ్మకాయల ప్రసాద్, సుప్రియ, నాగచైతన్య, నాగార్జున గారికి చెప్పి ఒప్పించిన తర్వాతే సినిమా ఓకే అయింది అని నరేష్ చెప్పుకొచ్చారు.ఒక కొత్త దర్శకుడు తన కథను ఇంతమంది కీలక వ్యక్తులకు వివరించి, ప్రతి ఒక్కరినీ కన్విన్స్ చేసి సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లడం చిన్న విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో తమ సినిమా దర్శకుడు చంద్రమోహన్ సక్సెస్ అయ్యారని ప్రశంసించారు.
ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. కొత్త దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తే తమ సంస్థ ద్వారా సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.దీంతో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక కథను ఓకే చేయడానికి సంస్థలోని కీలక వ్యక్తుల ఆమోదం ఎంత ముఖ్యమో నరేష్ మాటల ద్వారా అర్థమవుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నరేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సినిమా చేయాలనుకునే కొత్త దర్శకులకు కేవలం మంచి కథ ఉంటే సరిపోదనే విషయం స్పష్టమవుతోంది. కథను వివిధ స్థాయిల్లో వివరించి, దానిపై నమ్మకం కలిగించి, చివరకు సంస్థలోని కీలక నిర్ణయాధికారులను కూడా ఒప్పించాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

