సాధారణంగా ఎవరైనా స్టంట్స్ చేస్తే చూడాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే.. స్టంట్స్ అంటేనే అలా ఉంటాయి. చూసేవాళ్లకే భయం కలిగేలా చేస్తారు కొందరు. సర్కస్‌లో కూడా ఫీట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా డిఫరెంట్. అసలు.. ఇటువంటి ఫీట్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరు.
గిన్నిస్ వరల్డ్ రికార్డునే బ్రేక్ చేసిన ఫీట్ ఇది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని తలకిందులుగా ఎత్తుకొని.. 100 మెట్లను కేవలం 53 సెకన్లలో ఎక్కే వీడియో. ఇద్దరి మధ్య కేవలం తలలే బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఏమాత్రం అటూ ఇటూ అయినా పైన ఉన్న వ్యక్తి కింద పడాల్సిందే.
కానీ.. పైన ఉన్న వ్యక్తి తలకిందులుగా ఉన్నా.. అతడిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. 100 మెట్లను.. 53 సెకన్లలో ఎక్కి రికార్డు సృష్టించారు ఇద్దరు సోదరులు.
వీళ్లది వియత్నాం. సర్కస్‌లో ఫీట్లు చేస్తుంటారు. 2016 లో వీళ్లే 52 సెకన్లలో 90 స్టెప్స్ ఎక్కారు. ఆ తర్వాత 2018 లో వీళ్ల రికార్డును మరో వ్యక్తి బ్రేక్ చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును వీళ్లు బ్రేక్ చేశారు. మొత్తానికి వీళ్ల ఫీటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.