వాషింగ్టన్: ఈ నెల 3న డాలస్లో హైదరాబాద్ విద్యార్థి చంద్రశేఖర్ పోలెను కాల్చి చంపిన నిందితుడు రిచర్డ్ ఫ్లోరెజ్ను అమెరికా పోలీస్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వాహనంలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు దవాఖానలో ఉన్నాడు. అతడిపై హత్య కేసు నమోదు చేసినట్టు ఫోర్ట్ ఫోర్త్ పోలీస్ అధికార ప్రతినిధి బ్రాడ్ పెరెజ్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో సహాయం చేస్తున్నట్టు, ఈ విషయంలో అతడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు హ్యూస్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.