న్యూయార్క్ : భారతీయ అమెరికన్, న్యూయార్క్ మేయర్ జోహ్రా మమ్దానీ భారత్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగురోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్, రాణి కామిల్లాలను మర్యాదపూర్వకంగా మేయర్ మమ్దానీ బుధవారం న్యూయార్క్‌లో కలుసుకున్నారు.
అయితే, కింగ్ చార్లెస్‌తో ప్రైవేట్‌గా సమావేశమైతే.. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు ఇచ్చేయాలని ఆయన్ని కోరేవాణ్ని అని మమ్దానీ చెప్పుకొచ్చారు. ట్విన్ టవర్స్‌పై 2001 ఉగ్రదాడి బాధితుల స్మారకార్థం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బ్రిటన్ రాజు, రాణి హాజరై మృతులకు నివాళులు అర్పించారు.