హాంకాంగ్ ; హాంకాంగ్‌లోని థాయ్‌పో జిల్లాలో బుధవారం ఎనిమిది 35 అంతస్తుల నివాస భవనాలలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 36 మంది మరణించగా, 279 మంది గల్లంతైనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. మంటలు వ్యాపించిన ఫ్లాట్లలో చాలా మంది ఇప్పటికీ చిక్కుకుని ఉన్నట్లు పత్రిక పేర్కొంది. ఎనిమిది భవనాలకు మంటలు వ్యాపించగా ఇప్పటివరకు కేవలం ఒక భవనంలోని మంటలనే ఆర్పినట్లు తెలిపింది. మరమ్మతుల కోసం భవనంపైన వెదురు కర్రలు అమర్చారని, వీటి కారణంగా మంటలు త్వరితంగా వ్యాపించాయని పేర్కొంది. ఈ వాంగ్ ఫుక్ కోర్టు కాంప్లెక్స్‌గా పిలిచే ఈ ఎస్టేట్‌లో మొత్తం 1984 ఫ్లాట్లు ఉండగా దాదాపు 4,000 మంది ఇందులో నివసిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో నివసించే వారి కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసిన హాంకాంగ్ ప్రభుత్వం నిర్వాసితులను అక్కడికి తరలిస్తోంది.