Revolt Beer | న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ చిత్రాలు ముద్రించిన క్యాన్లలో ‘మహాత్మా జి’ బ్రాండ్‌తో బీర్ అమ్ముతున్న రష్యన్ కంపెనీ రివోల్ట్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఒడిశా సామాజిక-రాజకీయ నాయకుడు సుపర్నో సత్పతి ఈ బీర్ క్యాన్ల చిత్రాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని రష్యా అధికారులతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గాంధీజీ చిత్రాలున్న రివోల్ట్ బీర్ క్యాన్లను ఇద్దరు భారతీయులు పట్టుకొని ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది షేర్ చేశారు. రివోల్ట్ కంపెనీ చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అగౌరవనీయమని, దిగ్భ్రాంతి కలిగించేదని కొందరు అన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదని మరొకరు వ్యాఖ్యానించారు.