Porsche Car | మాస్కో, ఫిబ్రవరి 27: రష్యా రాజధాని మాస్కోకు సమీపంలోని మైటిష్చ్కు చెందిన ఒక వ్యక్తి గొడవైన తన భార్యను ప్రసన్నం చేసుకోవడానికి వేలంటైన్స్ డే నాడు 27 లక్షల విలువైన పోర్షేకారును బహూకరించాడు. అక్కడే ఆ వ్యక్తి చిన్న తప్పు చేశాడు. కారు కొనుగోలుకు ముందే దానికి స్వల్పంగా డ్యామేజి అయ్యింది. అది చూసి ఆమె దానిని తిరస్కరించడంతో మండుకొచ్చిన భర్త దానిని చెత్తకుప్పలో వదిలేయడంతో రెండు వారాలుగా ఇప్పుడది అలాగే ఉంది.
పైగా అది టూరిస్టు ప్రదేశంగా మారింది. స్థానికులతో పాటు పలువురు అక్కడకు వచ్చి కారుతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతం సందడిగా మారడంతో అధికారులు ఆ కారును తొలగించలేదు.