Accident | జస్ట్ మిస్.. గాల్లోకి లేచి దూసుకొచ్చిన ట్రక్కు.. త్రుటిలో తప్పించుకున్న యువకుడు!
రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. ఆ యువకుడు ఒక ఇంటి ముందు నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ల కోసమేనేమో? చేతిలో కాగితాలపై ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి పెద్దగా చప్పుడు వచ్చింది. తిరిగి చూస్తే ఒక పెద్ద ట్రక్కు అతని మీదకు దూసుకొచ్చేసింది. అదృష్టం బాగుండటంతో సదరు యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటన బ్రెజిల్‌లోని సియారా ప్రాంతంలో వెలుగు చూసింది. ట్రక్కు వెనుక భాగానికి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు తగలడంతో.. ఆ వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న యువకుడి మీదకు దూసుకొచ్చింది. అయితే అదృష్టం బాగుండటంతో ట్రక్కు ముందు భాగం కాకుండా.. పక్క భాగం అతనికి తగిలింది.
దాంతో ట్రక్కుకు, రోడ్డు పక్కనే ఉన్న గోడకు మధ్యలో అతను నిలబడిపోయాడు. వాహనం ఆగగానే భయంతో దూరంగా పరుగు తీశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్రక్కులోని డ్రైవర్, ప్యాసింజర్ కిందకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా.. సదరు యువకుడి అదృష్టం చూసి ఆశ్చర్యపోతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Accident
- Brazil
- Luck
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

