Iran-India | భారత్లోని మైనారిటీల పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారంతో ఉన్నాయని భారత్ పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను ఖండించిన భారత్.. ముందు ఖమేనీ తమ సొంత రికార్డును పరిశీలించుకోవాలని స్పష్టం చేసింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఎక్స్ వేదికాగా అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లోని ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాజా, మయన్మార్ తోపాటు భారత్ లోనూ ముస్లింలకు ఇబ్బందులు తప్పడం లేదని, వారి బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. మైనారిటీల గురించి మాట్లాడే దేశాలు తమ సొంత రికార్డును పరిశీలించుకోవాలంటూ చురకలేసింది.