కొలంబో: ఎండా కాలం కదా తాగే నీళ్ల కోసం ఈ డబ్బాలన్నింటినీ లైనులో పెట్టారనుకుంటున్నారా?.. అయితే మీరు డబ్బాలో కాలుపెట్టినట్లే.. అవన్నీ డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద వరుసగా పెట్టారు. తమ వాహనాలను బయటకు తీయడానికి కూడా ఇంధనం లేకపోవడంతో ఇలా డబ్బాలను పెట్రోల్ బంకుల వద్దకు తీసుకొచ్చారు జనాలు. తమ వంతుకోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ.. చివరికి లైన్లలో డబ్బాలను పెట్టారు. ఈ దృశ్యాలు ఎక్కడివో ఇప్పటికే గుర్తొచ్చుంటుంది. అవును తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో. దేశ రాజధాని కొలంబోలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ దృష్యం కనిపించింది.
దేశంలో చమురు నిల్వలు ఎప్పుడో అడుగంటాయి. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు డబ్బాలతో పెట్రోల్ బంకుల వద్ద క్యూకట్టారు. అధ్యక్షుడు రాజపక్స అభ్యర్థన మేరుకు 40 వేల టన్నుల డిజిల్ను శ్రీలంకకు భారత్ పంపించింది. కార్గో షిప్ ఆదివారం ఉదయం దేశానికి చేరింది. దానిని ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన పెట్రోల్ బంకుల వద్ద పెద్ద పెద్ద డబ్బాలు లైన్లుగా కనిపిస్తున్నా. వాహనాలు భారీగా వరుసలు కట్టాయి.
కాగా, రెండు క్రితం తమ స్కూల్ వ్యాన్లో డీజిల్ అయిపోయిందని దాని యజమాని చెప్పారు. అప్పటి నుంచి బంకుల చుట్టూ తిరుగుతున్నానని, ఇప్పటివరకు ఎక్కడా డీజిల్ లభించలేదని చెప్పారు. దీంతో డీజిల్ లేదన్నారు.