అందుకే వారు తెల్లారేసరికి కోటీశ్వరులు..ఎలాగంటే
అందుకే వారు తెల్లారేసరికి కోటీశ్వరులు..ఎలాగంటే| యెమెన్‌లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన 35 మంది మత్స్యకారులకు అదృష్టం ఎదురొచ్చి మరీ స్వాగతం ...

సనా: అదృష్టవంతులను చెరపలేరు.. దురదృష్టవంతులను బాగు చేయలేరని సామెత.. అదృష్టం ఉంటే ఏ క్షణంలోనైనా.. ఎక్కడ నుంచైనా.. ఏ రూపంలోనైనా వచ్చి తలుపు తడుతుంది..
అలాగే యెమెన్‌లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన 35 మంది మత్స్యకారులకు అదృష్టం ఎదురొచ్చి మరీ స్వాగతం పలికింది. వారు తమ పడవలో రోజు మాదిరే సముద్రంలోని గల్ఫ్ అడెన్‌లో ప్రాంతంలో చేపల వేటకెళ్లారు. వారి పడవకు చనిపోయిన ఓ స్పెర్మ్ తిమింగలం ఎదురుపడింది.
మత్స్యకారులు ఈ భారీ కాయాన్ని కోసి చూశారు. ఈ తిమింగలం కడుపులో విలువైన పదార్థం ‘అంబగ్రీస్’ దొరికింది. దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లగా అది దాదాపుగా రూ.10 కోట్లు పలుకుతుందని వ్యాపారులు వెల్లడించారు.
దీంతో మత్స్య కారులు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ‘అంబగ్రీస్’ అనేది తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు గానీ, ఉమ్మినప్పుడు గానీ బయటకొస్తుంది. సెంట్ల తయారీలో ‘అంబగ్రీస్’కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
‘అంబగ్రీస్’ అంటే ‘సముద్ర కోశాగారం (treasure of sea)’, ‘తేలియాడే బంగారం (floating gold)’ అని పిలుస్తారు. దీనికి కిలోగ్రామ్‌కు 50 వేల డాలర్లు పలుకుతుంది.
ఇవి కూడా చదవండి:
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
స్పేస్స్టేషన్కు వెళ్తూ పగటి పూట స్పష్టంగా కనిపించిన స్పేస్‌క్రాఫ్ట్.. వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

