కుక్కలు విశ్వాస జంతువులు. అందుకే చాలామంది వాటిని పెంచుకుంటారు. ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. ఇక చిన్నపిల్లలైతే పెంపుడు కుక్కలను తమ స్నేహితుల్లాగే భావిస్తారు. వాటితోనే ఆడుకుంటుంటారు. ఓ చిన్నారి చలికి వణికిపోతున్నపెంపుడు కుక్కకు దుప్పటి కప్పిన హృదయపూర్వకరమైన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘బుల్డాగ్ లవర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి తన కుక్కపై స్వచ్ఛమైన ప్రేమను ప్రదర్శించింది. పెంపుడు కుక్క నిద్రిస్తుండగా చిన్నారి ఓ దుప్పటి తీసుకొచ్చి దానికి కప్పింది. తనుకూడా పక్కనే పడుకుని, కుక్కను నిమురుతూ నిద్రపుచ్చింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. కుక్క, చిన్నారి మధ్య ఉన్న అందమైన బంధాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడ్డారు.
Every kid should have a dog.#dogsoftwitter #Bulldog #bulldoglover #SLEEP #baby pic.twitter.com/LfzVAr4U6G
— Bulldog Lover (@Bulldog_world45) July 4, 2022