బ్యాంకాక్: బ్యాంకాక్‌లోని(Bangkok) ప్రముఖ టూరిస్టు స్పాట్ సఫారీ వరల్డ్ జూలో దారుణం ఘటన చోటుచేసుకున్నది. పర్యాటకుల ముందే జూ కీపర్‌ను సింహాలు దారుణంగా చంపేశాయి. జియాన్ రంగ్ఖరసమీ అనే వ్యక్తి సఫారీ వరల్డ్ జూలో (Safari World zoo) గత 20 ఏండ్లుగా జూ కీపర్‌గా పనిచేస్తున్నారు. జీప్‌లో పర్యాటకులకు సింహాలను చూపించేందుకు సఫారీకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి తన కారులో నుంచి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. దీంతో మూడు సింహాలు అతనిపై దాడికి దిగాయి. పర్యాటకులు ఎదుటే 15 నిమిపాల పాటు అతనిపై దాడిచేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని జూ సిబ్బంది దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
సింహాల దాడిని అడ్డుకునేందుకు పలువురు పర్యాటకులు ప్రయత్నించారు. వాటి దృష్టిని మరల్చేందుకు హారన్ కొట్టడంతోపాటు ఈళలు, పెద్ద పెట్టున కేకలు వేశారు. అయినా అవి పట్టించుకోకుండా తమ పనికానిచ్చేశాయి. ఈ ఘటనతో పర్యాటకులు భయాందోళలనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జూలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గత 40 ఏండ్లలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని అధికారులు చెప్పారు. పర్యాటకులు, సిబ్బంది రక్షణకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు.