Smoking | టోక్యో : ధూమ పానం చేసే వారి చట్టబద్ధ వయసుపై పరిమితులు విధించాలని జపాన్ పరిశోధకులు సూచించారు. 22 ఏండ్ల వారికే ధూమపానం చేసేందుకు చట్టబద్ధంగా అనుమతించాలని వారు పేర్కొన్నారు. 20 ఏండ్లలోపే ధూమపానం అలవాటు చేసుకున్న వారిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. తక్కువ వయసులో పొగ తాగడానికి అలవాటు పడిన వారు దాన్ని అంత సులువుగా వదులుకోలేరని అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. 22 ఏండ్లు, అంత కంటే ఎక్కువ వయసు ఉన్న వారినే ధూమపానం చేసేందుకు అనుమతించేలా చట్టాలు చేయాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు వారు సూచించారు.