Diabetes | రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూస్తున్నారా.. అయితే మీకు మధుమేహం వచ్చినట్టే!
రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం వల్ల టైప్ 2 మధుమేహ ముప్పు 67 శాతం పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
Diabetes | సిడ్నీ: రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం వల్ల టైప్ 2 మధుమేహ ముప్పు 67 శాతం పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 84,700 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఇందుకోసం 2013 నుంచి 2016 మధ్యకాలంలో ఒక్కొక్కరికి వారం రోజుల పాటు చేతులకు లైట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. తొమ్మిదేండ్ల తర్వాత ఈ డాటాను విశ్లేషించగా ఎక్కువగా రాత్రిపూట వెలుగులో ఉన్న వారిలో మధుమేహ ముప్పు 67 శాతం పెరిగిందని గుర్తించారు. రాత్రి పూట ఎంత ఎక్కువ సేపు వెలుగులో ఉంటే అంత ఎక్కువగా ఈ ముప్పు పెరుగుతున్నట్టు తేల్చారు.
వెలుగు వల్ల మానసిక, శారీరక మార్పులు
రాత్రిపూట ఎక్కువగా వెలుగును చూడటం, వెలుతురులో గడపడం వల్ల మనిషిలో మానసిక, శారీరక మార్పులు వస్తాయని, 24 గంటల చక్రం దెబ్బతింటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది గ్లూకోజ్ మెటాబాలిజంలోనూ మార్పులకు కారణమవుతుందని తెలిపారు. తద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించుకునే శక్తి తగ్గిపోతుందని, మధుమేహం మొదలవడానికి దారి తీస్తుందని పరిశోధకుడు అండ్రూ ఫిలిప్స్ తెలిపారు. రాత్రిపూట స్క్రీన్లు చూడటం, రోజూ ఒకే సమయానికి నిద్ర పోకపోవడం వంటివి మధుమేహ ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

