Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Graduates Registration | త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త, పాత గ్రాడుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ : త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త, పాత గ్రాడుయేట్ల ఓటర్ ( Graduates Registration ) నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) పిలుపునిచ్చారు.
దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలకు సంబంధించి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పట్టభద్రులైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా తమ ఓటు నమోదు చేసుకోవడంతో పాటు, గ్రామస్థాయిలో ఉన్న ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరు నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమే విజయం సాధించామని, మరోసారి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు 11 వేల మంది పట్టభద్రులు ఉన్నందున ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, రాబోయే వారం రోజుల పాటు ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దేవరకద్ర ఇన్చార్జి పల్లె రవి, ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మండల ఇన్చార్జిలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

