కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
woman jumps from 18th floor | వెన్నెముక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఆరేళ్ల కుమారుడితో కలిసి బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో వారిద్దరూ మరణించారు. భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది.
ముంబై: వెన్నెముక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఆరేళ్ల కుమారుడితో కలిసి బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో వారిద్దరూ మరణించారు. భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. (woman jumps from 18th floor) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి-చించ్వాడ్లోని ఒక అపార్ట్మెంట్లో 33 ఏళ్ల ఏక్తా, మనోజ్ దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి నివసిస్తున్నారు. పూణేలోని ఒక ఐటీ కంపెనీలో మనోజ్ పనిచేస్తున్నాడు. భార్య ఏక్తా కొంతకాలంగా వెన్నెముక సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది.
కాగా, శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఏక్తా తన ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి బిల్డింగ్‌లోని 18వ అంతస్తుకు చేరుకున్నది. అక్కడ ఉన్న ఒక డక్ట్‌లోకి వారిద్దరూ దూకారు. కింద పడటంతో తీవ్రంగా గాయపడి మరణించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణానికి ముందు ఏక్తా రాసినట్లు భావిస్తున్న ఏడు పేజీల ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. భర్త పట్ల తన భావాలను అందులో ఆమె వ్యక్తం చేసింది. తన మరణానంతరం తిరిగి పెళ్లి చేసుకుని, జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని భర్తను కోరింది.
అలాగే కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన, తనపై బెంగతో పాటు భర్త తిరిగి పెళ్లి చేసుకోవడం కష్టమవుతుందన్న ఆలోచనతో కుమారుడిని కూడా తనతో పాటు తీసుకువెళ్లాలనే తన నిర్ణయాన్ని ఏక్తా ఆ లేఖలో ప్రస్తావించింది. తల్లి, కొడుకు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 18th floor
- Husband
- Jumps
- note
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

