Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Omar Abdullah | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 56 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిధితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నిన్నటి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు.
Omar Abdullah : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 56 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిధితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నిన్నటి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో నిధిని ట్యాగ్ చేశారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఒమర్ అబ్దుల్లా మొదటి భార్య పాయల్‌కు విడాకులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన మూడు నెలలకే ఈ వివాహం జరిగింది. ఒమర్ అబ్దుల్లాకు దూరంగా ఉంటున్న భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేసేందుకు జూలై 31న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంతోపాటు, ఒకరిపై మరొకరు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేయాలని ఉమ్మడిగా కోరారు. ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాయల్, ఒమర్ 2009 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2011లో ఒమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

