బీజింగ్: జీవనశైలిలో మార్పులతో చాలామంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. మరికొందరేమో అతినిద్రతో బాధపడుతున్నారు. ఈ రెండూ ప్రమాదకరమేనని చైనా పరిశోధకులు తేల్చారు. అతి తక్కువ సమయం నిద్రపోవడం, అతినిద్ర రెండూ మనిషి ఆయుర్ధాయాన్ని తగ్గిస్తున్నట్టు కనుగొన్నారు.
ఈ రెండింటికీ శారీరక శ్రమ ఒక్కటే పరిష్కార మార్గమని తేల్చారు. 90 వేల మంది యుక్త వయస్కులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వారు నిద్రపోయే సమయం, శారీరక శ్రమను పక్కాగా లెక్కించారు. నిద్రలేమి, అతినిద్రతో బాధపడేవారు రోజులో ఎక్కువ శారీరక శ్రమ చేస్తే అకాల మరణ ముప్పు తప్పుతున్నదని గుర్తించారు.