దెర్నా (లిబియా), సెప్టెంబర్ 15: లిబియాలో వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇంకా 10 వేల మంది ఆచూకీ దొరకడం లేదు. వరదల్లో ముగినిపోయిన డెర్నాలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
బురదలో కూరుకుపోయిన భవనాల్లో చిక్కుకొని మరణించిన వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిపోయిన వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.