మనీలా: పిలిప్పీన్స్‌లో మే 9వ తేదీన దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు లెని రోబ్రిడో … దేశాధ్యక్ష పోటీలో నిలిచారు. రోబ్రిడో ఆధ్వర్యంలో ప్రస్తుతం పిలిప్పీన్స్‌లో పింక్ రెవల్యూషన్ నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ కుమారుడిపై ఈసారి ఆమె పోటీలో ఉన్నారు. ప్రస్తుతం దేశాధ్యక్ష రేసులో ఉన్న ఏకైక మహిళ లెని రోబ్రిడోనే. నిజానికి బాంగ్‌బాంగ్ మార్కోస్ జూనియర్ కన్నా వెనుకబడి ఉన్న రోబ్రిడో తన ర్యాలీలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది.
రోబ్రిడో వయసు 57 ఏళ్లు. మాజీ మానవహక్కుల న్యాయవాది ఆమె. ఆర్థికవేత్త కూడా. మార్కోస్ వర్గానికి ప్రధాన ప్రతిపక్ష నేత. మే 9వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఆమె ఫ్రంట్‌రన్నర్. రోబ్రిడో భర్త మాజీ కేబినెట్ మంత్రి. 2012లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించిన తర్వాత రోబ్రిడో రాజకీయ ప్రవేశం చేశారు. 2013లో ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఓటర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి తిరిగారు. నేరుగా ప్రజలతో మాట్లాడేవారు. సహజ విపత్తులు సంభవించినప్పుడు నేరుగా వచ్చి ఆదుకునేది. ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి నాయకత్వాన్ని ఆమె తీవ్రంగా విమర్శించింది.
ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఎల్లో రంగు లిబరల్ పార్టీలో ఉన్నా.. ప్రస్తుతం ఇండిపెడెంట్‌గా ఆమె పింక్ కలర్‌తో ప్రచారం నిర్వహిస్తోంది. ఆమెకు మద్దతు ఇస్తున్నవారు ఇప్పుడు పింక్ దుస్తుల్ని ధరిస్తున్నారు. ఆ జాబితాలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. డుటెర్టి వద్ద పనిచేసినా.. డ్రగ్స్‌పై భీకర వార్ సాగించిన డుటెర్టిని ఆమె తప్పుపట్టారు. అయితే ఈ సారి జరిగే అధ్యక్ష ఎన్నికల్లో లెని రోబ్రిడో సంచలనం క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కొందరు భావిస్తున్నారు. పింక్ రెవల్యూషన్ చేపడుతున్న రెబ్రిడో.. సీనియర్ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది.