Lenacapavir Vaccine | ‘లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్‌తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇక మహిళల్లో జరిపిన పరీక్షల్లో వందశాతం ప్రభావవంతంగా ఉందని తెలిసింది. ఇక పురుషుల్లో హెచ్‌వీఐ సంక్రమణను దాదాపు తొలగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాదాపు ఐదువేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు ఎవరూ ఇన్ఫెక్షన్ బారినపడలేదు. టీకాను ఆరునెలల వ్యవధిలో ఏడాదికి రెండు టీకాలు ఇస్తారు. హెచ్ఐవీతో బాధపడుతున్న 120 పేద దేశాల్లో లెనాకాపవిర్ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని డ్రగ్ తయారీ కంపెనీ గిలియడ్ పేర్కొంది.
యూఎన్ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయానిమా మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న ఇతర చికిత్సలతో పోలిస్తే ఇది మెరుగైన పరిష్కారమని తెలిపారు. ఇప్పటికే లెనాకపవిర్ అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో అందుబాటులో ఉంది. డ్యూక్ యూనివర్సిటీలోని గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్ బెయిరర్ మాట్లాడుతూ లెనాకాపవిర్ను ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఉపయోగిస్తున్నారన్నారు. ఇది యూఎస్, కెనడా, యూరప్, ఇతర దేశాల్లో హెచ్ఐవీ సంక్రమణకు చికిత్సగా సన్లెకా బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తుల్లో చికిత్సకు ఇది అద్భుతం కంటే తక్కువేమీ కాదని బైనిమా అన్నారు. గతేడాది 6.30 లక్షల మంది ఎయిడ్స్ రోగులు మరణించగా.. ఇది 20 ఏళ్లలో అత్యల్పం. ఆదివారం విడుదలైన అమెరికాలో గతేడాది 6.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2004 నుంచి అత్యంత తక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమనే ఆశను పెంచుతోందని శాస్త్రవేతలు పేర్కొంటున్నారు.