బ్యాంకాక్, జూన్ 18: ఆగ్నేయాసియా దేశాల్లో ప్రప్రథమంగా థాయ్లాండ్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసే బిల్లును ఆ దేశ మెజారిటీ సెనేట్ సభ్యులు మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు దీనికి ఉన్న ఆఖరి అవరోధం కూడా తొలగిపోయి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. 152 మంది సభ్యులున్న సెనేట్లో ఈ బిల్లుకు 130 ఓట్లు అనుకూలంగా పడ్డాయి.