బీరుట్: లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా కొత్త నేతను ప్రకటించింది. షేక్ నయిమ్ కాస్సెమ్ ఆ సంస్థ కొత్త అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఇజ్రాయిల్ జరిపిన దాడిలో హిజ్బొల్లా నేత హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. నస్రల్లాకు చాన్నాళ్లుగా కాస్సెమ్ డిప్యూటీగా చేశారు. హసన్ మృతి తర్వాత యాక్టింగ్ లీడర్‌గా కూడా చేశారు. హిజ్బొల్లాకు చెందిన సురా కౌన్సిల్ కాస్సెమ్ను నేతగా ఎన్నుకున్నది. సుమారు మూడు దశాబ్ధాల పాటు నస్రల్లాకు డిప్యూటీగా కాస్సెమ్ చేశారు. విజయం సాధించే వరకు నస్రల్లా పాలసీలతో పోరాడనున్నట్లు హిజ్బొల్లా కొత్త నేత తెలిపారు.
మరో వైపు ఇజ్రాయిల్ నిర్వహించిన దాడిలో.. 60 మంది మృతిచెందారు. ఓ అయిదు అంతస్తుల భవనంపై అటాక్ జరిగింది. దాంట్లో నార్త్ గాజాకు చెందిన పాలస్తీనియన్లు ఉంటున్నారు. మృతిచెందిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.