గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 15:48:24

లాస్‌వెగాస్ వెల‌వెల‌.. క్యాసినోల మూసివేత‌

లాస్‌వెగాస్ వెల‌వెల‌.. క్యాసినోల మూసివేత‌

హైద‌రాబాద్‌:  క‌రోనా కాటుకు గ్యాంబ్ల‌ర్లు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న కాసినోల‌ను మూసివేశారు.  నెల రోజుల పాటు క్యాసినోల‌ను మూసివేయాల‌ని అమెరికా ప్ర‌భుత్వం ఆదేశించింది.  ప్ర‌తి రోజు వేలాది మంది జూద‌గాళ్లు  లాస్ వెగాస్‌లో గ్యాంబ్లింగ్ ఆడేందుకు వ‌స్తుంటారు.  అయితే క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

  క్యాసినోలు, రెస్టారెంట్లు, ఇత‌ర బిజినెస్ కేంద్రాల‌ను మూసివేస్తున్న‌ట్లు నెవ‌డా రాష్ట్రం ప్ర‌క‌టించింది. తాజా ప్ర‌భుత్వ ఆదేశాల‌తో గ్యాంబ్లింగ్ రాజ‌ధానిగా పేరుగాంచిన లాస్ వెగాస్ వెల‌వెల‌బోయింది. సాధార‌ణంగా లాస్ వెగాస్‌లో 24 గంట‌లూ క్యాసినోలు తెరిచి ఉంటాయి. 1963లో జాన్ ఎఫ్ కెన్న‌డీ అంత్య‌క్రియ‌లు రోజున మాత్ర‌మే క్యాసినోల‌ను మూసివేశారు. మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనా భ‌యంతో వాటిని లాక్‌డౌన్ చేశారు.  logo