లండన్: ఆర్థిక మోసాలకు పాల్పడి భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తాము అతిపెద్ద పలాయనవాదులం అంటూ విజయ్‌మాల్యాతో కలిసి ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన వీడియోపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు.
తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారత ప్రభుత్వంపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ లండన్‌లోని బెల్గ్రేవ్ స్కేర్‌లో ఉన్న తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఓ వీడియోను చిత్రీకరించి, పోస్ట్ చేశారు. ఆయనతోపాటు మాల్యా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.