న్యూఢిల్లీ, మే 1: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కైల్ కార్డీ. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఇతడి వయసు 30 ఏండ్లు. కానీ గత 8 ఏండ్లలో ఏకంగా 50 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? వీర్యం దానం చేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా 50 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. వచ్చే నెలలో ఇంకా పది మంది పిల్లలు పుట్టబోతున్నారని పేర్కొన్నాడు. తనకు మంచి జీవిత భాగస్వామి దొరక్కపోవడంతోనే ఈ మార్గం ఎంచుకున్నానని చెబుతున్నాడు.