కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. అయితే ఆ దాడికి చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆ వీడియోను రిలీజ్ చేసింది. అగ్నిమాపక సిబ్బంది ఆ మాల్లో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు మారియపోల్ నగరం .. రష్యా ఇచ్చిన డెడ్‌లైన్‌ను తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. ఆయుధాలను వదిలేస్తే, పౌరుల తరలింపునకు సహకరించనున్నట్లు రష్యా చెప్పింది. కానీ రష్యా ప్రభుత్వాన్ని నమ్మలేమని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. మారియపోల్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. నగరంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఆ నగరంలో ఇంకా మూడు లక్షల మంది తలదాచుకుంటున్నారు. వాళ్లకు విద్యుత్తు, నీరు, ఆహారం అందడం లేదు.
Kyiv shopping centre hit by Russian missile #UkraineRussiaWar #UkraineWar #Ukraine️ #Kiev #StopPutin #StopWar pic.twitter.com/R6NVU4JA8f
— World news (@Nft79073269) March 21, 2022