Ukraine | ఉక్రెయిన్‌లో దుండగుడి కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
Ukraine : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందించారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు వెల్లడించారు.
Ukraine : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందించారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు వెల్లడించారు. ఈ ఘటన శనివారం జరిగింది. చేతిలో గన్ కలిగిన ఒక దుండగుడు కీవ్‌లోని వీధుల్లో సాధారణ పౌరులపైకి కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల కారణంగా రక్తస్రావం జరిగి ఆరుగురు మరణించారు.
మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, దుండగుడు అక్కడివారిలో నలుగురిని బంధీలుగా తీసుకున్నాడు. స్థానిక సూపర్ మార్కెట్లోకి వెళ్లి, బంధీలను అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు, దుండగుడికి మధ్య కాల్పులు జరిగాయి. కానీ, పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు. అనంతరం పోలీసులు బంధీలను విడిపించారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక, కాల్పులకు పాల్పడిన దుండగుడి గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ కాల్పుల ఘటనకు కారణాలు కూడా తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

