న్యూయార్క్: ఆస్ట్రియన్ చిత్రకారుడు గుస్తావ్ క్లిమ్ట్ గీసిన ఎలిజబెత్ లెడెరర్ పెయింటింగ్‌కు వేలంలో రూ.2,091 కోట్లు ధర పలికింది. వేలంలో అత్యధిక ధర పలికిన రెండో కళాఖండంగా నిలిచింది. అదేవిధంగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆధునిక కళాఖండంగా రికార్డు సృష్టించింది.
దీని ఎత్తు ఆరు అడుగులు, దీనిని 1914-1916 మధ్యకాలంలో గీశారు. సౌత్‌బై ఆక్షన్‌లో మంగళవారం దీనిని సొంతం చేసుకోవడం కోసం బిడ్డర్లు పోటీపడ్డారు. గతంలో దీనిని నాజీలు దొంగిలించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అగ్ని ప్రమాదంలో దాదాపు ధ్వంసమైంది. ఇది 1948లో లెడెరర్ సోదరుడు ఎరిక్ వద్దకు తిరిగి వచ్చింది.