వాషింగ్టన్: అమెరికాలో ‘కిస్సింగ్ బగ్స్’ విస్తరిస్తున్నాయి. ఇవి నిద్రపోతున్న మనుషుల ముఖాలపై కుట్టి, ఆ గాయం పరిసరాల్లో ప్రమాదకరమైన పరాన్నజీవులను విడుదల చేస్తాయి. ఫలితంగా చాగస్ వ్యాధి సోకుతుంది. దీనిని సత్వరమే గుర్తించి, చికిత్స చేయకపోతే, నెమ్మదిగా గుండె, జీర్ణ వ్యవస్థలు దెబ్బతింటాయి.
చివరికి ప్రాణాంతక పర్యవసానాలకు దారి తీయవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా సహా 32 రాష్ర్టాల్లో ఈ వ్యాధి సోకినవారు ఉన్నట్లు అంచనా.